రామ్ చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!

Published on Feb 9, 2023 3:00 am IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మరింత గా పెరిగింది అని చెప్పాలి. అయితే ఈ చిత్రం ఇచ్చిన విజయోత్సాహంతో రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలు కమిట్ అయ్యారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

అంతేకాక ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో మరొక చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయగా, ఇప్పుడు మరొక క్రేజ్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ లో చర్చ జరుగుతుంది. మఫ్టి చిత్రం తో కన్నడ లో మంచి పేరు తెచ్చుకున్న నర్తన్ తో రామ్ చరణ్ ఒక చిత్రం చేయనున్నారు. నర్తన్, రామ్ చరణ్ కి పూర్తి స్క్రిప్ట్ ను వినిపించగా, నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నావి యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా ఉండనుంది. అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :