నర్తన్‌తో రామ్ చరణ్ సినిమా పై లేటెస్ట్ బజ్!

Published on Feb 20, 2023 1:00 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అయితే కన్నడ దర్శకుడు నర్తన్ తెలుగులో రామ్ చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో గాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ దర్శకుడు శివ రాజ్‌ కుమార్‌తో తన తదుపరి సినిమా అని ప్రకటించాడు.

భైరతి రణగల్ అనే టైటిల్ తో ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. లేటెస్ట్ బజ్ ఏమిటంటే, నర్ధన్ తన నెక్స్ట్ భైరతి రణగల్ పూర్తి చేసిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా ను షురూ చేయనున్నారు. ఈలోపు రామ్ చరణ్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :