‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యిపోయిందా? ఎప్పుడంటే

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ కలయికలో దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమానే పెద్ది. మంచి హైప్ ని సెట్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా నుంచి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఏకంగా 200మిలియన్ కి పైగా వ్యూస్ అందుకుంది. ఇక నెక్స్ట్ సాంగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది.

దీని ప్రకారం మేకర్స్ ఈ ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. అలాగే ఈ సాంగ్ పక్కా మాస్ నెంబర్ అన్నట్టు కూడా సమాచారం. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్ అలాగే మిర్జాపూర్ ఫేమ్ దివ్యెందు శర్మ తదితరులు సాలిడ్ పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version