రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ పై క్లారిటీ ఇదే!

Published on May 5, 2023 11:48 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ గోపాల్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గేమ్ చేంజర్ టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. రామ్ చరణ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ ఉప్పెన ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం లో చేయనున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ బజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను త్వరలో మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలో వెలువడే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :