“సలార్” రిలీజ్ పై నయా బజ్.!

Published on Sep 20, 2023 9:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా అన్ని సెట్ అయ్యి ఉంటే వచ్చే వారం లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సినిమా పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ విడుదలని వాయిదా వేశారు. ఇక ఈ సరికొత్త రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఎగ్జైటింగ్ గా మారగా ఇప్పటికే పలు సమయాలు వైరల్ మారగా లేటెస్ట్ గా అయితే మరో కొత్త బజ్ వినిపిస్తుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దానిని కూడా వాయిదా వేసినట్టు అందరికీ ఇప్పటికే అర్ధం అయ్యింది. మరి ఈ సమయంలో సలార్ ని దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. దీనితో సంక్రాంతి రిలీజ్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :