“సర్కారు వారి పాట” మ్యూజికల్ ఫీస్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jan 14, 2022 9:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ కం స్టైలిష్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అంతే మోస్ట్ అవైటెడ్ గా ఈ సినిమా తాలూకా ఫస్ట్ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ మరియు మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సాంగ్ ఈ జనవరి మొదటి వారం లోనే రావాల్సి ఉంది కానీ తర్వాత సంక్రాంతికి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి కీలక అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ అప్డేట్ తో జనవరి 26న సాంగ్ రిలీజ్ అన్నౌన్స్ చేయనున్నట్టు టాక్. మరి చూడాలి ఈ సాంగ్ రిలీజ్ ఎప్పుడు అనేది. అలాగే థమన్ ఫస్ట్ సాంగ్ ని రేంజ్ లో ఇచ్చాడో అని కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :