శేఖర్ కమ్ముల, ధనుష్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Oct 4, 2022 10:05 am IST

గ్లోబల్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా ఇప్పుడు నటించిన పలు చిత్రాలు రిలీజ్ లు సహా షూటింగ్స్ తో తాను బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ ఏడాదిలో మూడు నాలుగు రిలీజ్ లతో సిద్ధంగా ఉన్న ధనుష్ తన కెరీర్ లో నెవర్ బిఫోర్ స్పీడ్ లో ఇప్పుడు ఉన్నాడు. ఇక ఇలా ఒకదానికి ఒకటి డిఫరెంట్ చిత్రాలు చేస్తున్న ధనుష్ మన తెలుగులో కూడా చేస్తున్న చిత్రాలు ఉన్నాయి.

అలా తెలుగులో తాను మొదట అనౌన్స్ చేసిన చిత్రం మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ములతో అని అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ కాగా దీనిపై అయితే ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు తెలుస్తుంది. మేకర్స్ ఈ చిత్రం షూటింగ్ ఆరంభానికి సమయం ఫిక్స్ చేశారట. ఈ చిత్రాన్ని మేకర్స్ ఫైనల్ గా అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారట. ఈ కాంబోపై ఆల్రెడీ మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :