Irumudi OTT: సంచలన హిట్ ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లేటెస్ట్ సంచలన హిట్ సినిమానే ఇరుముడి. బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అయ్యి ఊహించని లాభాలు అందించింది. అయితే ఈ సినిమా రికార్డ్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ సెప్టెంబర్ 18నుంచి సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్టుగా లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు చేయగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version