టాక్..సూర్య “కంగువ” రిలీజ్ డేట్ ఖరారు?

Published on Nov 11, 2023 7:02 am IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “కంగువ”. మరి ఇది సూర్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ సినిమా కావడంతో తమిళ తెలుగు సహా హిందీలో కూడా గట్టి హైప్ నెలకొంది. మరి దీనితో పాటుగా తమిళ్లో రికార్డ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది.

ఇక ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ పై అయితే ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని ప్రకారం ఈ భారీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 11న రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే యూవీ క్రియేషన్స్ మరియు గ్రీన్ స్టూడియో వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 10 భాషల్లో 3డి లో రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం :