“వాల్తేరు వీరయ్య” నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ బజ్.!

Published on Dec 14, 2022 9:00 am IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు అవి మరింత స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ టీజర్ లు మంచి ప్రామిసింగ్ గా కనిపిస్తూ ఆకట్టుకోగా ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ కూడా అదిరే లెవెల్లో హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు అయితే ఈ సినిమా రెండో సాంగ్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. మరి దీని ప్రకారం అయితే ఈ వారాంతంలో అయితే మేకర్స్ ఈ సాంగ్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. మరి దీనిపై అధికారిక అప్డేట్ కూడా రానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :