“యష్ 19” పై లేటెస్ట్ బజ్.!

Published on Mar 12, 2023 12:00 am IST

పాన్ ఇండియా సినిమా దగ్గర తన చిత్రాలు కేజీయఫ్ ఫ్రాంచైజ్ తో ఓ రేంజ్ లో క్రేజ్ ని తాను సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ సెన్సేషనల్ సినిమాలు తర్వాత యష్ ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది ఆసక్తిగా మారగా ఎట్టకేలకు చాలా కాలం సస్పెన్స్ తర్వాత అయితే యష్ తన కెరీర్ లో 19వ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది అనౌన్స్ చేసాడు. మరి ఈ సినిమాకి ఇంకా దర్శకుడు ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు.

కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో దీనిని ప్లాన్ చేశారు. మరి ఇదిలా ఉండగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. ఈ సినిమాపై అయితే అతి త్వరలోనే ఓ క్రేజీ అప్డేట్ ని మనం ఆశించవచ్చట. దీనితో ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ రానుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని ఎవరు టేకప్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. మరి ఆ అప్డేట్ దానికోసమేనా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :