“కల్కి 2898 ఎడి” ప్రీరిలీజ్ ఈవెంట్ పై లేటెస్ట్ బజ్.!


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి”. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి నేడు భారీ ఈవెంట్ ఒకటి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుంది.

అయితే సినిమాలో కేవలం ఓ పాత్ర తాలూకా వాహనాన్ని చూపించడానికి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయడం అందరిలో ఒకింత ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఈవెంట్ ఏపీలోనే జరగనున్నట్టుగా తెలుస్తుంది.

ఎలాగో తెలంగాణాలో భారీ ఈవెంట్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఆంధ్రలో అభిమానుల కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్కడే చేస్తారని వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version