పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సలార్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా కెజిఎఫ్ సిరీస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ మూవీని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ ఫై విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈమూవీ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ ని కొన్ని టెక్నీకల్ ఇష్యూస్ వలన కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు నేడు మేకర్స్ ప్రకటించారు.
తదుపరి రిలీజ్ పై అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయితే విషయం ఏమిటంటే, తాజా బాలీవుడ్ బజ్ ప్రకారం సలార్ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ సంస్థ స్టార్ గ్రూప్ వారు దక్కించుకోగా, డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్ వారు సొంతం చేసుకున్నారట. మొత్తంగా రిలీజ్ కి ముందే శాటిలైట్, అలానే డిజిటల్ రైట్స్ రూపంలో ఇంత భారీ డీల్ జరగడంతో మూవీ పై అందరిలో ఏ స్థాయి హైప్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి రిలీజ్ అనంతరం సలార్ ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.