లేటెస్ట్..”RRR” రిలీజ్ పై రెండు వెర్షన్ లు..!

Published on Jan 1, 2022 8:00 am IST

ప్రస్తుతం భారీ ఎత్తున ప్రమోషన్స్ జరుపుకుంటూ రిలీజ్ కి సన్నద్ధం అయ్యిపోయిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి చేసిన మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది. మొత్తం పాన్ ఇండియన్ వైడ్ ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ భారీ సినిమా రిలీజ్ ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది అని అనుకుంటే కరోనా కాటు మరోసారి తప్పేలా లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.

దీనితో ఈ భారీ సినిమా రిలీజ్ పట్ల రెండు వెర్షన్ లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అనుకున్న డేట్ కే జనవరి 7నే వస్తుంది అని ఒక మాట అయితే వాయిదా పడింది అని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కనుక వాయిదా పడితే వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కావచ్చని ఇంకో వెర్షన్ వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం ప్రస్తుతం అంతా గందరగోళంగానే ఉంది. మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఎలాగో రిలీజ్ కి కొన్ని రోజులు మాత్రమే ఉంది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది.

సంబంధిత సమాచారం :