“సలార్” అవైటెడ్ అప్డేట్ పై క్లారిటీ వైరల్.!

Published on May 25, 2022 9:05 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తూన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ చేస్తుండగా గత కొన్ని రోజులు కితం ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ టీజర్ కోసం మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ టీజర్ ఈ నెల మే లోనే ఉంటుంది అని అంతా ఫిక్స్ అయ్యారు.

కానీ అనూహ్యంగా ఈ టీజర్ పై ఇప్పుడు ఫైనల్ క్లారిటీని మేకర్స్ అందించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా నిర్మాత లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మే నెలలో సలార్ టీజర్ ని రిలీజ్ చెయ్యడం లేదని ప్రస్తుతం కి వాయిదా వేస్తున్నామని అలాగే ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనితో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి మరి నిరాశే ఫైనల్ గా ఎదురయ్యింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :