“మహేష్ 28” ఆ గాసిప్స్ పై లేటెస్ట్ క్లారిటీ.!

Published on Jul 26, 2022 4:01 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తమ కాంబోలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సినిమా కోసం తెలిసిందే. తమ గత చిత్రం “ఖలేజా” అనుకున్న స్థాయి విజయం సొంతం చేసుకోకపోయినా కూడా ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాపై భారీ స్థాయి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఆగస్ట్ నుంచి స్టార్ట్ కానుండగా ఈ చిత్రంపై కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలిసింది. అయితే దీనిపై క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ ఎలాంటి డబుల్ రోల్ లో కనిపించరట. సింగిల్ గానే ఉంటారని తెలుస్తుంది. సో ఈ రూమర్స్ లో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని గ్రాండ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :