ప్రభాస్ చేసే ఈ సినిమాపై లేటెస్ట్ క్లారిటీ.!

Published on Mar 16, 2022 8:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” రీసెంట్ గా విడుదలై మిక్సిడ్ రెస్పాన్స్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. యంగ్ దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా లైన్ లో ఉండగానే ప్రభాస్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో పెట్టుకున్నాడు.

మరి వీటిలో రీసెంట్ అన్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యిన చిత్రం దర్శకుడు మారుతీ తో చేయబోయేది. తనతో కూడా ఒక లో బడ్జెట్ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అనుకోని విధంగా రాధే శ్యామ్ ఫలితంతో ఈ సినిమా నుంచి ప్రభాస్ తప్పుకున్నాడని కొన్ని ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.

మరి దీనిపై క్లారిటీ వినిపిస్తుంది. ఇందులో ఎలాంటి నిజం లేదట. వీరి ప్రాజెక్ట్ ఆగిపోలేదని స్టిల్ లైవ్ లోనే ఉందని తెలుస్తుంది. సో ప్రభాస్ నుంచి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ అయితే రావడం కన్ఫర్మ్ అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :