టాక్..”సలార్” రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ..!

Published on May 25, 2022 9:04 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శ్రుతిహాసన్ హసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “సలార్” కోసం అందరికి తెలిసిందే. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సాలిడ్ సినిమా కేజీయఫ్ రెండు భాగలకి మించిన హంగులతో తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా లేటెస్ట్ గా నిర్మాత విజయ్ పలు కీలక కామెంట్స్ చెయ్యడం ఆసక్తి గా మారింది.

ఈ సినిమాని ఎలా ప్లాన్ చేస్తున్నారు టీజర్ ఎప్పుడు అనే వాటిపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు అనే దానిపై కూడా టాక్ వినిపిస్తోంది. మరి దీని ప్రకారం అయితే మేకర్స్ ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి తర్వాతే రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట. అంటే ఏ ఆగస్టు రిలీజ్ గాని అక్టోబర్ రిలీజ్ గాని చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఇక సలార్ నుంచి అన్నీ కాస్త లేట్ గానే ఉంటాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :