గ్లోబల్ స్టార్ తో “కిల్” దర్శకుడు భారీ ప్రాజెక్ట్.. క్లారిటీ ఇదే

గ్లోబల్ స్టార్ తో “కిల్” దర్శకుడు భారీ ప్రాజెక్ట్.. క్లారిటీ ఇదే

Published on Feb 15, 2025 10:27 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు. అయితే ఈ సినిమా తర్వాత ఇక అంచనాలు అన్నీ మిగతా సినిమాలు మీదనే ఉండగా వీటిలో బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ చిత్రం “కిల్” దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో ఒక భారీ ఫాంటసీ సినిమా చేస్తున్నాడు అంటూ పలు రూమర్స్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయ్యాయి.

మరి ఈ ఊహించని కలయికపై ఓ రేంజ్ హైప్ కూడా నమోదు కాగా ఇపుడు ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ బయటికి వచ్చింది. బాలీవుడ్ హంగామాతో మాట్లాడిన ఈ టాలెంటెడ్ దర్శకుడు ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తను తేల్చేశారు. సో గ్లోబల్ స్టార్, కిల్ దర్శకుడు కాంబినేషన్ అనేది ఇపుడు అవాస్తవం అని చెప్పక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు