మెగాస్టార్ సినిమాలో రవితేజ రోల్ పై లేటెస్ట్ క్లారిటీ..!

Published on May 4, 2022 12:32 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో పలు రీమేక్ సినిమాలతో పాటుగా కొన్ని స్ట్రైట్ సినిమాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో యంగ్ దర్శకుడు కే ఎస్ రవీంద్ర(బాబీ) తో చేస్తున్న మాస్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచే మంచి హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే ఈ సినిమాలో టాలీవుడ్ మరో స్టార్ హీరో అయినటువంటి మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. అలాగే మళ్ళీ తాజాగా తాను తప్పుకున్నాడని కూడా వినిపించాయి. అయితే దీనిపై ఇప్పుడు లేటెస్ట్ క్లారిటీ అయితే తెలుస్తుంది.

రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అనే మాట అయితే అవాస్తవం అట. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :