సాయి తేజ్ “గాంజా శంకర్” పై లేటెస్ట్ క్లారిటీ.!

సాయి తేజ్ “గాంజా శంకర్” పై లేటెస్ట్ క్లారిటీ.!

Published on Feb 21, 2024 11:07 AM IST

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “బ్రో” తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ తర్వాత తాను ఫిజికల్ గా అలాగే మెంటల్ గా కూడా కాస్త సెటిల్ అయ్యాక స్టార్ట్ చేసిన మాస్ ప్రాజెక్ట్ నే “గాంజా శంకర్”. దర్శకుడు సంపత్ నంది సాయి తేజ్ కోసం ప్రిపేర్ చేసిన ఈ మాస్ సబ్జెక్టు తో మళ్ళీ చాలా కాలం తర్వాత సాయి తేజ్ ఓ సాలిడ్ మాస్ సినిమా చేస్తున్నాడని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే రీసెంట్ గా ఈ సినిమా ఆగిపోయింది అని బడ్జెట్ సమస్యలు దీనితో పాటుగా సినిమాలో కంటెంట్ పరంగా కొన్ని న్యాయ పరమైన సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీనితో ఈ సినిమా ఆగిపోయింది అనే టాక్ విస్తృతంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై క్లారిటీ తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ సినిమా ఇష్యూస్ అన్నీ కూడా ఫిక్స్ చేసినట్టుగా టాక్. దీనితో సినిమా సినిమా ఆగిపోలేదని సినిమా మళ్ళీ స్టార్ట్ అవుతుందని లేటెస్ట్ బజ్. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు