“స్కంద 2” పై లేటెస్ట్ క్లారిటీ.!

Published on Oct 3, 2023 7:07 am IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్ లుగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా “స్కంద” కోసం అందరికీ తెలిసిందే. మరి మాస్ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ ని అయితే మెప్పించింది. ఇక వసూళ్ల పరంగా కూడా రామ్ కెరీర్ లో సాలిడ్ నంబర్స్ ని రిజిస్టర్ చేసిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా సీక్వెల్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేసారు.

అయితే క్లైమాక్స్ లోనే రివీల్ చేసిన ఈ అంశంపై లేటెస్ట్ క్లారిటీ అయితే తెలుస్తుంది. ఈ చిత్రానికి ఫైనల్ రన్ ఎలా ఉన్నప్పటికీ బోయపాటి మాత్రం సీక్వెల్ ని రెడీ చేయడం అయితే ఖాయం అట. దీనితో అయితే స్కంద సీక్వెల్ డెఫినెట్ గా రాబోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :