“చరణ్ 15” విషయంలో ఈ రూమర్స్ పై క్లారిటీ..!

Published on Aug 12, 2022 1:00 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా విజనరీ దర్శకుడు శంకర్ కాంబోలో చేస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. శంకర్ మరియు రామ్ చరణ్ ల కెరీర్ లో 15వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండడంతో మరిన్ని అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ని శంకర్ దాదాపు చాలా ఫాస్ట్ గానే చేసేసారు. తన గత సినిమాల్లా కాకుండా కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే చాలా మేర షూటింగ్ చేసేసారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కి సంబంధించి కొన్ని రోజులు నుంచి ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ అవుతుండగా దీనిపై అయితే ఓ క్లారిటీ వినిపిస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ కి యష్ మరియు పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్స్ హాజరవుతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ శంకర్ టీం నుంచి టాక్ ఏమిటంటే ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ స్టార్స్ ఈ ఈవెంట్ కి హాజరు కావట్లేదని అంటున్నారు. అలాగే ఈవెంట్ కూడా వేరే దేశాల్లో చెయ్యడం లేదని టాక్. మరి వీటిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :