లేటెస్ట్ క్లిక్ : సూపర్ స్టార్ బ్యాక్ ఆన్ ట్రాక్

Published on Sep 12, 2023 10:00 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తున్న మహేష్ బాబు ఎప్పటికప్పుడు డైటింగ్ తో పాటు నిత్యం జిమ్ చేస్తూ తన బాడీని ఫిట్ గా మెయిన్ టెయిన్ చేస్తుంటారు. అయితే విషయం ఏమిటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ ఆన్ ట్రాక్ అంటూ కొద్దిసేపటి క్రితం ఆయన జిమ్ చేస్తున్న పిక్ ని నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :