లేటెస్ట్ క్లిక్ : ఫ్యామిలీతో మాస్ మరహజా రవితేజ ఎంజాయ్ మెంట్

Published on Sep 2, 2023 1:00 am IST

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తో పాటు ఈగిల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో యువ దర్శకడు వంశీ డైరెక్టర్ గా పరిచయం అవుతూ తీస్తున్న టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇక కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్స్ విషయమై ప్రస్తుతం బిజీగా ఉన్నారు రవితేజ.

ఇక తాజాగా ఈగిల్ సినిమా షూటింగ్ లో భాగంగా ఫామిలీ తో కలిసి టోక్యో వెళ్లిన మాస్ మహారాజా రవితేజ అక్కడ వారితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం రవితేజ తన సతీమణి కళ్యాణి, కూతురు మోక్షద, కుమారుడు మహాదన్ తో పాటు ఇతర కుటుంబసబ్యల తో కలిసి దిగిన రెండు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన సినిమా విరామ సమయాల్లో ఎక్కువగా కుటుంబంతో గడిపే రవితేజ అటు సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటారు.

సంబంధిత సమాచారం :