“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” లేటెస్ట్ యూఎస్ వసూళ్లు.!

Published on Sep 10, 2023 9:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి టాక్ తో హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు మన్ననలు కూడా అందుకున్న ఈ చిత్రం యూఎస్ లో అయితే అదిరే వసూళ్ళని అందుకుంది.

మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 8 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా డిస్ట్రిబ్యూటర్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం ఇప్పుడు 8 లక్షల 18 వేల డాలర్స్ వసూలు చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ తో కొనసాగుతుంది అని తెలిపారు. దీనితో ఈ చిత్రం డెఫినెట్ గా 1 మిలియన్ మార్క్ ని ఇప్పుడు క్రాస్ చేయనుంది అని చెప్పొచు. ఇక ఈ చిత్రానికి రాధన్, గోపి సుందర్ లు సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :