బాలయ్య “అన్ స్టాప్పబుల్ 2” ఫస్ట్ ఎపిసోడ్ పై క్రేజీ ఇన్ఫో..!

Published on Oct 4, 2022 1:58 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన బిగ్గెస్ట్ హిట్ టాక్ షో “అన్ స్టాప్పబుల్” సీజన్ 2 షూట్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ షో షూట్ నుంచి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ స్టిల్స్ కూడా బయటకి రాగా ఇప్పుడు ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ పై క్రేజీ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఇది వరకు వచ్చిన టాక్ ని నిజం చేస్తూ మొదటి ఎపిసోడ్ లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట.

ప్రస్తుతం ఈ ఎపిసోడ్ తాలూకా షూట్ జరుగుతుందట. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ లోనే నారా లోకేష్ కూడా కనిపించనున్నారని కూడా ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది. మరి లోకేష్ పై అయితే ఓ స్టన్నింగ్ అండ్ స్పెషల్ ఎంట్రీ ని కూడా ఈ ఎపిసోడ్ లో డిజైన్ చేశారట. మరి ఈ అవైటెడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే “ఆహా” లో మిస్సవ్వకుండా చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :