లేటెస్ట్ : ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ పై క్రేజీ టాక్

Published on Nov 20, 2023 9:14 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూడు మూవీస్ లో ఒకటైన సలార్ సీస్ ఫైర్ పార్ట్ 1 మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక దీని తరువాత కల్కి 2898 ఏడి, అలానే మారుతీ తో చేస్తున్న మూవీస్ రిలీజ్ కానున్నాయి.సలార్ లో మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా మాస్ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమాల అనంతరం ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీ కమిట్ అయిన ప్రభాస్, ఇటీవల మరొక దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఒక మూవీ ఒప్పుకున్నట్లు కొన్నాళ్లుగా న్యూస్ వస్తోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనుండగా దీనిని అత్యంత భారీ స్థాయిలో దాదాపుగా రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారట. అలానే సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లవ్, యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా రూపొందనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించిన పూర్తి వివరాలు మేకర్స్ నుండి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :