ప్రభాస్ – మారుతీ మూవీ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్

Published on Feb 25, 2023 5:18 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ముందుగా అయన నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న గ్రాండ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. దాని తరువాత ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రానుంది. ఇక వీటితో పాటు నాగ అశ్విన్ తో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కె 2024 సంక్రాతికి రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మారుతీ దర్శకత్వంలో ఒక భారీ కమర్షియల్ జానర్ మూవీ కూడా చేస్తున్నారు ప్రభాస్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించి ప్రస్తుతం ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో బజ్ గా మారింది. దాని ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ కు తాతయ్య పాత్ర ఉంటుందని, ఆ పాత్ర సినిమాకి ఎంతో కీలకం అని తెలుస్తోంది. కాగా ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కనిపంచనున్నారట. ఇటీవల కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలో అధీర పాత్రలో అదరగొట్టిన సంజయ్ దత్ ఈ సినిమాలోని తన పాత్ర ద్వారా మరొక్కసారి ఆడియన్స్ మెప్పు అనుకోవడం ఖాయం అని యూనిట్ అంటోందట. కాగా దీనిపై అతి త్వరలో మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :