ఓటిటిలో రామ్ “వారియర్” పార్ట్నర్, రిలీజ్ పై అఫీషియల్ ఇన్ఫో..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్” కోసం అందరికీ తెలిసిందే. రామ్ మరియు దర్శకుడు ఎన్ లింగుసామి నుంచి వచ్చిన ఈ బై లాంగువల్ చిత్రం రిలీజ్ అయ్యి మంచి స్పందనను కూడా అందుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై అయితే లేటెస్ట్ అప్డేట్ ఒక అధికారికంగా బయటకి వచ్చింది.

ఈ చిత్రం ఓటిటి హక్కులని ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా మరి వారు ఈ సినిమా స్ట్రీమింగ్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఈ ఆగస్ట్ లోనే హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ చిత్రం ఈ ఆగస్ట్ నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా కూడా తెలిపారు. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version