టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్న లేటెస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, హారిక సూర్యదేవర గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీని కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. ఇప్పటికే మ్యాడ్ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి.
నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ ఫిలింనగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. కాగా విషయం ఏమిటంటే, ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా యువ నటుడు దుల్కర్ సల్మాన్, అలానే స్పెషల్ గెస్ట్ గా యువ అందాల నటి శ్రీలీల విచ్చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు ముగించి మ్యాడ్ మూవీని అక్టోబర్ 6 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇంకా ఈ మూవీలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీగౌరి ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.