లేటెస్ట్..ఏపీలో “రావణాసుర” కి అదనపు షోస్.!

లేటెస్ట్..ఏపీలో “రావణాసుర” కి అదనపు షోస్.!

Published on Mar 31, 2023 1:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” కోసం తెలిసిందే. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో అయితే మొత్తం ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మరి ఈ సినిమా పై సాలిడ్ బజ్ ఇప్పుడు నెలకొనగా మేకర్స్ కూడా మంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ఈ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుండగా లేటెస్ట్ గా అయితే ఇంట్రెస్టింగ్ క్లారిటీ తెలుస్తుంది.

ఈ సినిమాకి ఏపీలో అయితే మొత్తం 5 షో లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సాధారణ షోస్ తో పాటుగా అనేక ప్రాంతాల్లో అయితే రావణాసుర చిత్రం తెల్లవారు జాము 7 గంటల షోస్ కూడా పడనున్నాయి. దీనితో అయితే ఏపీలో మొదటి రోజు గట్టి వెల్కమ్ ఉండనుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ లు సంగీతం అందించగా అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు