టాక్..”పుష్ప” హిందీ వెర్షన్ పై ఊహించని బజ్.!

Published on Nov 6, 2021 6:09 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఫస్ట్ ఎవర్ భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తూ సాఫీగా షూటింగ్ జరుగుతూ డిసెంబర్ రిలీజ్ కి ఫిక్స్ అయ్యింది. కానీ ఊహించని విధంగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓ టాక్ మాత్రం సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ చిత్రం పలు దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని తెలిసిందే. దానికి తగ్గట్టుగా చాలా గట్టి ప్లానింగ్స్ చిత్ర యూనిట్ చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ లో రిలీజ్ కి పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని సినీ వర్గాల్లో నయా టాక్. ఈ మధ్య ఇవి సర్దుమణిగాయని బజ్ వచ్చినా తర్వాత కంప్లీట్ గా పుష్ప హిందీ వెర్షన్ రిలీజ్ పై అదే టాక్ కంటిన్యూ అవుతుంది. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More