లేటెస్ట్ : ‘గుంటూరు కారం’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్ డేట్ అందించిన ప్రొడ్యూసర్

Published on Sep 27, 2023 1:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, జగపతి బాబు, రఘుబాబు, సునీల్, ప్రకాష్ రాజ్, ఆలీ తదితరులు నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎప్పటి నుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తమ అనుబంధ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితం అయిన మ్యాడ్ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ పై సూపర్ అప్ డేట్ అందించారు.

ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం పక్కా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, కానీ రానున్న దసరా పండుగ కంటే ముందే సాంగ్ అయితే రిలీజ్ అవుతుందని ఆయన తెలిపారు. అలానే గతంలో తాను చెప్పినట్లుగా ఈ మూవీ తప్పకుండా జనవరి 12న రిలీజ్ అనంతరం రాజమౌళి గారి మూవీస్ కలెక్షన్ కి దగ్గరగా వెళ్తుందని నమ్మకం ఉందని, ఆ విషయాన్ని మూవీని చూసిన అనంతరం ప్రేక్షకాభిమానులే చెప్తారని ఆయన అన్నారు. మొత్తంగా అతి త్వరలో గుంటూరు కారం నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

సంబంధిత సమాచారం :