లేటెస్ట్..తన లైఫ్ లో కొత్త జర్నీ అనౌన్స్ చేసిన హన్సిక.!

లేటెస్ట్..తన లైఫ్ లో కొత్త జర్నీ అనౌన్స్ చేసిన హన్సిక.!

Published on Nov 2, 2022 12:00 PM IST

స్టార్ హీరోయిన్ హన్సిక కోసం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సహా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు ఆమె చేసింది. మరి ఇప్పుడు ఈమె అయితే తక్కువ ప్రాజెక్ట్స్ తోనే ఉండగా మరోపక్క తన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈమె తన లైఫ్ లో కీలక స్టెప్ తీసుకున్నట్టుగా షాకింగ్ పోస్ట్ తో ఊహించని ట్విస్ట్ ని ఇచ్చింది. ఈ లైఫ్ పార్ట్నర్ సోహైల్ ఖటురీయా ని పెళ్లి చేసుకుంటున్నట్టుగా తెలిపింది.

మరి ఈ ఇద్దరు కూడా పారిస్ లో ఐఫిల్ టవర్ ముందు ఇద్దరు ప్రపోసల్ తో ఒక్కటైనట్టుగా హన్సిక ఆ బ్యూటిఫుల్ ఫోటోలు షేర్ చేసి తాను పెళ్లి చేసుకున్నట్టు అనౌన్స్ చేసింది. దీనితో అయితే ఈమె నుంచి ఈ సడెన్ పోస్ట్ చూసి ఫాలోవర్స్ ముందు కాస్త షాకైనా తర్వాత ఆమెకి మరియు తన భర్తకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. మరి ఆడియెన్స్ ని అలరించిన హన్సిక తన కొత్త లైఫ్ కి మా 123తెలుగు టీం కూడా కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెష్ ని తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు