నిలిచిపోయిన “ఉస్తాద్ భగత్ సింగ్”? హరీష్ క్లారిటీ వైరల్

నిలిచిపోయిన “ఉస్తాద్ భగత్ సింగ్”? హరీష్ క్లారిటీ వైరల్

Published on Jul 5, 2024 11:43 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో తన సెన్సేషనల్ హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో హిస్టరీ కూడా రిపీట్ అవుతుంది అని అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా పవన్ ఇచ్చిన కొన్ని డేట్స్ లోనే ఒక ఊహించని అవుట్ పుట్ ని ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసాడు హరీష్.

అయితే మరోసారి ఈ సినిమా నిలిచిపోయింది అంటూ కొన్ని రూమర్స్ మొదలు కాగా ఇప్పుడు వీటిపై హరీష్ శంకర్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. అభిమానులు ఈ సినిమాపై ఓ క్లారిటీ కోసం ఎదురు చూస్తుండగా “సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు …..” అంటూ తన మార్క్ సమాధానం ఇచ్చి ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేల్చేసాడు. దీనితో తన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు