టాక్..నాని సరసన లేటెస్ట్ హిట్ బ్యూటీ.?

టాక్..నాని సరసన లేటెస్ట్ హిట్ బ్యూటీ.?

Published on Dec 31, 2022 1:00 PM IST

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా మాస్ పాన్ ఇండియా సినిమా “దసరా” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై భారీ అంచనాలు కూడా ఉండగా ఇక నెక్స్ట్ అయితే తన కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రం 30వ ప్రాజెక్ట్ ని అయితే కొత్త దర్శకునితో చేయనున్నాడు. ఇక ఈ సినిమా అయితే రేపు కొత్త సంవత్సరం తో అనౌన్స్ కానున్నట్టుగా మేకర్స్ నిన్న తెలియజేసారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అయితే లేటెస్ట్ హిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నాని సరసన నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన సీతా రామం తో మృణాల్ ఎంతలా మెస్మరైజ్ చేసిందో ప్రత్యేకమ్హా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు ఈమెతో అయితే నాని సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. మరి రేపు అధికారిక అనౌన్సమెంట్ లో ఇది వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు