“బాలయ్య 107” సాలిడ్ ట్రీట్ పై లేటెస్ట్ ఇన్ఫో..!

Published on Jun 8, 2022 2:00 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ మాస్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. అయితే నిన్ననే ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక మాస్ అనౌన్సమెంట్ ని అందించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్సమెంట్ తో ఆ ట్రీట్ ఏంటా అని సర్వత్రా ఆసక్తి నెలకొనగా ఇప్పుడు ఈ మాస్ ట్రీట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

అయితే బాలయ్య బర్త్ డే కానుకగా ఒక మాస్ ట్రీట్ వస్తుండగా ఇది 35 సెకండ్స్ పాటు అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో ఉన్నట్టు టాక్ వైరల్ అవుతుంది. అలాగే తమ స్కోర్ బాలయ్యకి మరోసారి హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :