టాక్..”భీమ్లా నాయక్” ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ అయ్యిందా.!

Published on Dec 9, 2021 7:30 pm IST


వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ చిత్రాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మాసివ్ సినిమా “భీమ్లా నాయక్”. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పటికపుడు సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ రిలీజ్ డేట్ పట్ల కూడా చాలా క్లారిటీ గా ఉన్నారు.

అయితే ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ పై ఇప్పుడు లేటెస్ట్ గా బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ వచ్చే ఏడాదిలోనే ఉంటుందట. ఉంటే బహుశా జనవరి మొదటి వారాంతంలో ఉండొచ్చని టాక్. అలాగే టీజర్ కి సంబంధించి అయితే త్వరలోనే అప్డేట్ రానుంది అని సమాచారం.

ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12న తమ బ్లాస్ట్ ని ప్రెజెంట్ చెయ్యబోతున్నారు.

సంబంధిత సమాచారం :