“హరిహర వీరమల్లు” రిలీజ్ పై లేటెస్ట్ ఇన్ఫో..!

Published on Jan 29, 2023 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కాగా దీనిపై భారీ అంచనాలు సెట్ చేసుకొంది. ఇక ఈ భారీ చిత్రం పై అయితే లేటెస్ట్ కొన్ని అప్డేట్స్ తెలుస్తున్నాయి.

మేకర్స్ ఈ చిత్రాన్ని అయితే ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ కి తీసుకువస్తున్నట్టుగా రీసెంట్ అప్డేట్స్ వరకు కూడా తెలిపారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యం అయ్యేలా లేదట. దీనితో ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుంది కానీ దసరా కానుకగా అయితే ఈ భారీ సినిమా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సినిమా ఇంకా 30 శాతానికి పైగానే బాకీ ఉందట. దీనితో ఈ చిత్రం దసరా రిలీజ్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ సమాచారం.

సంబంధిత సమాచారం :