‘మా’ ఎన్నికలపై తాజా సమాచారం..ఆ న్యూస్ తప్పని క్లారిటీ.!

Published on Aug 3, 2021 4:22 pm IST


గత కొన్ని వారాల కితమే మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ‘మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలపై మళ్ళీ హీట్ మొదలయ్యింది సంగతి తెలిసిందే. పలువులు స్టార్ నటులు పాల్గొంటున్న ఈ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు అన్నది ఆసక్తిగా మారగా.. ఇప్పుడు ఈ ఎన్నికలపై మా సంఘం ఒక వర్చువల్ మీట్ ని నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తుంది.

మరి గత నెల 29న నిర్వహించిన ఈ వర్చువల్ మీట్ లో పలు సమస్యలపై చర్చించడమే కాకుండా వార్షికంగా గత 2020, 21 లో నిర్వహించుకునే డేట్స్ మరియు 2021 నుంచి 23 వరకు గత డేట్స్ పై చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ నెల 22న నిర్వహించాలన్న ఎన్నికలను కూడా వేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇంకా ఒక వర్గం మీడియా వారు మా ఎన్నికలు వచ్చే సెప్టెంబర్ నెల 9న జరుగుతున్నాయి అని ప్రచారం చేస్తున్నారు కానీ అది అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ మా ఎగ్జిక్యూటివ్ రాజశేఖర్ రాజీనామాని వెనక్కి తీసుకోవాలని సఖ్యతా భావంతో అనేక అంశాలకు పరిష్కారం చూపారు.

సంబంధిత సమాచారం :