టాక్..”ఎన్టీఆర్ 30″ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ ఇన్ఫో.!

Published on Jun 16, 2022 2:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు ఒప్పుకున్నా సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో తన కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు. మరి దీని నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అయితే పాన్ ఇండియా వీక్షకులకు ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీనితో ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యి రిలీజ్ కి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే మేకర్స్ అనుకుంటున్నా రిలీజ్ డేట్ పై ఓ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 19న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ తెలియాల్సి. ప్రస్తుతం అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఆ స్టార్టింగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ బ్యానర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :