లేటెస్ట్..”RRR” నుంచి అవైటెడ్ అప్డేట్ రాబోతోందా?

Published on Sep 29, 2021 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్సకా ధీరుడు రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” అనే సినిమా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ కోసం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి షూట్ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ ఏఈ అక్టోబర్ లో రిలీజ్ ఉండాల్సి ఉంది.

కానీ పలు కారణాల చేత మేకర్స్ ఈ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో కొత్త డేట్ ఎప్పుడు అనేది మరింత ఆసక్తిగా మారగా దీనికి మేకర్స్ తెరదించనున్నట్టు తెలుస్తుంది. తాజా బజ్ ప్రకారం మేకర్స్ ఇప్పుడు ఒక సరికొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తుంది. మరి వేచి చూడాలి ఇది ఎంతవరకు నిజమో ఎప్పుడు రిలీజ్ డేట్ వస్తుందో

సంబంధిత సమాచారం :