టైటిల్ అనౌన్స్ మెంట్ కి ముందే భారీ హైప్…భారీ ధరకు తలపథి67 డిజిటల్ రైట్స్!

టైటిల్ అనౌన్స్ మెంట్ కి ముందే భారీ హైప్…భారీ ధరకు తలపథి67 డిజిటల్ రైట్స్!

Published on Feb 1, 2023 6:49 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం తలపథి67. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ తో విక్రమ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లోకేష్ చేస్తున్న చిత్రం కావడం, వారసుడు/వరిసు తర్వాత విజయ్ చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ గా అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ఇంకా వెలువడక ముందే, చిత్రం యొక్క డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తుండగా, త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో సంజయ్ దత్, ప్రియ ఆనంద్, గౌతమ్ మీనన్, అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు