“ఎన్టీఆర్ 30” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్.!

“ఎన్టీఆర్ 30” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Dec 15, 2022 9:55 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా భారీ గుర్తింపు అయితే తన లాస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో అయితే తెచ్చుకుంటున్నాడు. మరి ఈ సినిమా తర్వాత మరో సినిమాకి వెళ్ళడానికి చాలా గ్యాప్ తీసుకుంటున్నప్పటికీ ఎన్టీఆర్ 30 సినిమాపై అంచనాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ కూడా భారీ హైప్ తో ఉంది.

ఇక రీసెంట్ గా ఇచ్చిన అప్డేట్స్ కూడా సినిమాపై మరింత ఆసక్తి రేపగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే తెలుస్తుంది. ఈ చిత్రం హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా హీరోయిన్ గా అయితే ఆల్ మోస్ట్ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫైనల్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. అలాగే దీనిపై అయితే రానున్న రోజుల్లో బిగ్ అనౌన్సమెంట్ కూడా ఇవ్వనున్నట్టుగా కూడా టాక్. మరి ఇదెప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు