ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న సినిమా ఫౌజీ కూడా ఒకటి. అసలు ఎవరూ ఊహించని రీతిలో మేకర్స్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేయడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు ఒక్కసారిగా మరింత ఎక్కువ అయ్యాయి.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు తెలుస్తుంది. ఈ జూలై ఎండింగ్ లోనే దీని తాలుకా గ్లింప్స్ రానుంది అనే టాక్ వినిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు. సినిమా ఎలానో స్వాతంత్ర నేపథ్యం సినిమా పైగా ఆ టైం లైన్ లోనిది కాబట్టి ఆగష్టు 15 సమయంలో వస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు.
సో ఫౌజీ గ్లింప్స్ ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 3న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.
