“పుష్ప 2” ఓటిటి డీల్ పై లేటెస్ట్ బజ్ ఏమిటంటే.!

Published on Aug 4, 2022 5:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా నేషనల్ వైడ్ భారీ హిట్ కావడంతో ఇక పార్ట్ 2 “పుష్ప ది రూల్” పై భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నాయి. ఇక ఈ చిత్రానికి అయితే మేకర్స్ అన్ని పనులు సెట్ చేస్తుండగా ఐకాన్ స్టార్ కూడా త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఆల్రెడీ భారీ డీల్స్ కూడా వస్తున్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈసారి పుష్ప 2 కి గాను భారీ ఓటిటి డీల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి డీల్ ని లాక్ చేసుకోడానికి అయితే దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి పుష్ప 2 ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :