టాక్..చరణ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

టాక్..చరణ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Aug 18, 2022 11:00 AM IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తో తన కెరీర్ లో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. శంకర్ మరియు రామ్ చరణ్ ల కెరీర్ లో ఇది 15వ సినిమా కాగా దీనిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ నుంచి నేవ బిఫోర్ సాలిడ్ లైనప్ కూడా సిద్ధంగా ఉంది.

పైగా ఇవి కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి క్రేజీ సబ్జెక్టు లు కూడా కావడంతో మెగా ఫ్యాన్స్ మరింత స్థాయిలో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే వీటిలో చరణ్ చేయబోయే నెక్స్ట్ 16వ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఒకటి బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట.

బహుశా డిసెంబర్ లోనే షూట్ స్టార్ట్ అవ్వచ్చని టాక్. ఇక అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మళ్ళీ జెర్సీ తర్వాత సంగీత దర్శకుడు అనిరుద్ తో ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నారు. మరి ఆల్రెడీ ఈ సినిమాని అయితే ఒక క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నట్టు రివీల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు