‘సలార్’ రిలీజ్ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్

Published on Sep 13, 2023 12:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా సినిమాల్లో ఒకటైన భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ సలార్ పై మన దేశంతో పాటు విదేశాల్లోని ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ మూవీ పక్కాగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే దీని పై మేకర్స్ నుండి ప్రకటన రావాల్సి ఉంది. ఇక మరోవైపు సలార్ వాయిదాతో పలు ఇతర సినిమాలు అదే సమయానికి రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. ఇక సలార్ ని దీపావళి కానుకగా నవంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని కొద్దిరోజలులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా ఈ మూవీ యొక్క రిలీజ్ పై మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం సలార్ ని డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి తెచ్చేందుకు మేకర్స్ సుముఖంగా ఉన్నారట. అలానే అందుకోసం డిసెంబర్ లో డేట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉందట టీమ్. ఒకవేళ సలార్ కనుక డిసెంబర్ లో వస్తే ఆ సమయంలో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమాలు జనవరి సమయంలో వస్తాయని అంటున్నారు. అయితే రిలీజ్ డేట్ పై కూడా పక్కాగా సలార్ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ ని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగాందూర్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :