“ఉస్తాద్ భగత్ సింగ్” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 14, 2023 1:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ కాప్ డ్రామా “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా మేకర్స్ ఈ సినిమా షూట్ నుంచి పలు ఆసక్తిగా వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేస్తూ మరింత బజ్ ని అయితే తీసుకొస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. సినిమా నుంచి మేకర్స్ ఇకపై రెగ్యులర్ గా ఏదొక అప్డేట్ గాని లేకపోతే సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్ లాంటివి వాటిని రిలీజ్ చేస్తారట. దీనితో సినిమాపై హైప్ ని అలా లైవ్ లోనే ఉంచాలని చూస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :